ఈ ఒప్పందం ఆంగ్లంలో (యు.ఎస్) వ్రాయబడింది. ఈ ఒప్పందానికి సంబంధించి అనువాదం చేయబడిన ఏదైనా సంస్కరణలోని విషయాలు, ఆంగ్ల సంస్కరణలోని విషయాలకు భిన్నంగా ఉంటే, ఆంగ్లం సంస్కరణనే పరిగణించవలసి ఉంటుంది.  దయచేసి యునైటెడ్ స్టేట్స్ వెలుపల ఉన్న వినియోగదారుల కోసం సాధారణ షరతులకు సెక్షన్ 16లో నిర్దిష్ట మార్పులు ఉంటాయని గమనించండి.
చివరి పునర్విమర్శ తేదీ: జనవరి 30, 2015
Impressum


www.facebook.com క్రిందకు వచ్చే వెబ్‌సైట్‌లు మరియు ఈ పేజీలోని సేవలు మీకు వీరిచే అందించబడుతున్నాయి:

Facebook ఐర్లాండ్ లిమిటెడ్, 4 గ్రాండ్ కెనాల్ స్క్వేర్, డబ్లిన్ 2, ఐర్లాండ్

బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్: గరెత్ లంబె, షానె క్రెహాన్
ఐర్లాండ్‌లో నమోదు చేయబడింది (కంపెనీల నమోదు కార్యాలయం)
కంపెనీ సం. 462932

నివేదిక ఎలా రూపొందించాలనే దాని గురించి సహాయం లేదా సమాచారం కోసం: ఇమెయిల్ ద్వారా మమ్మల్ని సంప్రదించడానికిl:


హక్కులు మరియు బాధ్యతల ప్రకటన
ఈ హక్కులు మరియు బాధ్యతల ప్రకటన ("ప్రకటన," "నిబంధనలు" లేదా "SRR") Facebook సిద్ధాంతాల నుండి ఉత్పాదించబడింది మరియు ఇవి Facebookతో అలాగే Facebook బ్రాండ్‌లు, ఉత్పత్తులు మరియు సేవలను ఉపయోగించే వినియోగదారులు మరియు ఇతరులతో మా సంబంధాన్ని నిర్వహించే మా సేవా నిబంధనలు, వీటిని మేము “Facebook సేవలు” లేదా “సేవలు” అని పిలుస్తాము. Facebook సేవలను ఉపయోగించడం లేదా యాక్సెస్ చేయడం ద్వారా, దిగువన సెక్షన్ 13కు అనుగుణంగా కాలానుగుణంగా నవీకరించిన ఈ ప్రకటనకు మీరు అంగీకరిస్తున్నారు. అదనంగా, Facebook ఎలా పని చేస్తుందో అర్థం చేసుకోవడంలో మీకు సహాయపడే ఈ పత్రం చివరన మీరు వనరులను కనుగొనవచ్చు.
Facebook విస్తృత పరిధిలో సేవలు అందిస్తున్నందున, నిర్దిష్ట యాప్, ఉత్పత్తి లేదా సేవతో మీరు పరస్పర చర్య చేయడానికి వర్తించే అనుబంధ నిబంధనలను సమీక్షించమని మరియు ఆమోదించమని మేము మిమ్మల్ని అడగవచ్చు. ఆ అనుబంధ నిబంధనలు ఈ SRRతో విబేధించే మేరకు, అప్లికేషన్, ఉత్పత్తి లేదా సేవతో అనుబంధించబడిన అనుబంధ నిబంధనలు ఆ అప్లికేషన్, ఉత్పత్తి లేదా సేవ విబేధించిన మేరకు మీ వినియోగానికి అనుగుణంగా నిర్వహించబడతాయి.
  1. గోప్యత

    మీ గోప్యత మాకు చాలా ముఖ్యం. ఇతరులతో భాగస్వామ్యం చేసుకోవడానికి మీరు Facebookను ఎలా ఉపయోగిస్తారు మరియు మీ కంటెంట్ మరియు సమాచారాన్ని మేము ఎలా సేకరిస్తాము మరియు ఉపయోగిస్తాము అనే వాటి గురించి ముఖ్యమైన సమాచారం అందించడానికి మేము మా డేటా విధానం రూపొందించాము. మేము డేటా విధానాన్ని డేటా విధానాన్ని చదవమని మరియు బుద్ధిపూర్వకమైన నిర్ణయాలు తీసుకోవడంలో మీకు సహాయపడేందుకు దీనిని ఉపయోగించమని మీకు సూచిస్తున్నాము.
     
  2. మీ కంటెంట్‌ను మరియు సమాచారాన్ని భాగస్వామ్యం చేయడం

    Facebookలో పోస్ట్ చేసే కంటెంట్ మరియు సమాచారం మొత్తం మీ స్వంతం మరియు మీ గోప్యత మరియు అప్లికేషన్ సెట్టింగ్‌ల ద్వారా దీన్ని భాగస్వామ్యం చేయగల మార్గాలను మీరు నియంత్రించవచ్చు. అదనంగా:
    1. మేథో సంపత్తి హక్కులచే దాచబడిన ఫోటోలు మరియు వీడియోలు (ఐపి కంటెంట్) వంటి కంటెంట్ కోసం, మీ గోప్యత మరియు అప్లికేషన్ సెట్టింగ్‌లకు లోబడి మీరు మాకు ముఖ్యంగా క్రింది అనుమతిని ఇవ్వాలి: Facebookలో (ఐపి లైసెన్స్) మీరు పోస్ట్ చేసే లేదా దానికి సంబంధించిన ఏదైనా ఐపి కంటెంట్‌ను ఉపయోగించడానికి మీరు మాకు ప్రత్యేకం-కాని, బదిలీ చేయదగిన, ఉప-లైసెన్స్ కలిగిన, రాయల్టీ రహిత, ప్రపంచవ్యాప్త లైసెన్స్‌ను మంజూరు చేయాలి. మీ కంటెంట్ ఇతరులతో భాగస్వామ్యం చేయబడి, వారు దాన్ని తొలగించకుంటే తప్ప మీరు మీ ఐపి కంటెంట్‌ను లేదా మీ ఖాతాను తొలగించినప్పుడు ఈ ఐపి లైసెన్స్ ముగుస్తుంది.
    2. మీరు ఐపి కంటెంట్‌ను తొలగించినప్పుడు, అది కంప్యూటర్‌లో రీసైకిల్ బిన్‌ను ఖాళీ చేసే విధంగానే తొలగించబడుతుంది. అయినప్పటికీ, తీసివేయబడిన కంటెంట్ నిర్దిష్ట సమయ వ్యవధిలో బ్యాకప్ కాపీలుగా ఉండవచ్చని తెలుసుకోండి (కానీ ఇతరులకు అందుబాటులో ఉండదు).
    3. మీరు అప్లికేషన్‌ను ఉపయోగించినప్పుడు, మీ కంటెంట్ మరియు సమాచారాన్ని అలాగే ఇతరులు మీతో భాగస్వామ్యం చేసిన కంటెంట్ మరియు సమాచారాన్ని ప్రాప్యత చేయడానికి అప్లికేషన్ మీ అనుమతి అడగవచ్చు.  మీ గోప్యతను గౌరవించడానికి మాకు అప్లికేషన్‌లు అవసరం, మరియు అప్లికేషన్ ఆ కంటెంట్ మరియు సమాచారాన్ని ఉపయోగించడం, నిల్వ చేయడం మరియు బదిలీ చేయడాన్ని ఆ అప్లికేషన్‌తో మీ ఒప్పందం నియంత్రిస్తుంది.  (అప్లికేషన్‌లతో ఇతరులు భాగస్వామ్యం చేయగల సమాచారాన్ని మీరు ఎలా నియంత్రించగలరనేదానితో సహా, ప్లాట్‌ఫారమ్ గురించి మరింత తెలుసుకోవడానికి మా డేటా విధానం మరియు ప్లాట్‌ఫారమ్ పేజీ చదవండి.)
    4. మీరు కంటెంట్‌ను మరియు సమాచారాన్ని ప్రాప్యత చేయడానికి మరియు ఉపయోగించడానికి, మరియు దాన్ని మీతో అనుబంధించడానికి (అంటే మీ పేరు మరియు ప్రొఫైల్ చిత్రం) పబ్లిక్ సెట్టింగ్‌ను ఉపయోగించి ఆ సమాచారాన్ని ప్రచురించడం అంటే మీరు Facebookలో లేని వ్యక్తులతో సహా ప్రతి ఒక్కరినీ అనుమతించడం అని అర్థం.
    5. Facebook గురించి మీరు అందించే అభిప్రాయం లేదా ఇతర సూచనలను మేము ఎల్లప్పుడూ అభినందిస్తాము, కానీ మీ అభిప్రాయం లేదా సూచనల కోసం మీకు ప్రతిఫలం ఇవ్వాలనే నిబంధన లేకుండా (మీకు వాటిని అందించాలనే నిబంధన లేనట్లుగానే) మేము వాటిని వినియోగించుకోవచ్చని అర్థం చేసుకోండి.
       
  3. భద్రత

    మేము Facebookను సురక్షితంగా ఉంచడానికి వీలైనంత కృషి చేస్తాము, కానీ మేము ఎలాంటి హామీ ఇవ్వలేము. Facebookను సురక్షితంగా ఉంచడానికి మాకు మీ సహాయం అవసరం, ఇందులో దిగువ తెలిపిన విధంగా మీ నిబద్ధత అవసరం:
    1. మీరు Facebookలో అనధికారిక వాణిజ్య కమ్యూనికేషన్‌లను (స్పామ్ వంటివి) పోస్ట్ చేయకూడదు.
    2. మీరు వినియోగదారు కంటెంట్‌ను లేదా సమాచారాన్ని సేకరించకూడదు, లేదా Facebookను యాక్సెస్ చేయకూడదు, ఆటోమేటెడ్‌ను ఉపయోగించడమంటే (బోట్‌లు, రోబోట్‌లు, స్పైడర్‌లు లేదా స్క్రాపర్‌ల సేకరణ వంటివి) మా ముందస్తు అనుమతి లేదని అర్థం.
    3. మీరు Facebookలో పిరమిడ్ స్కీమ్ వంటి చట్టబద్ధం కాని బహుళ-స్థాయి మార్కెటింగ్‌లో పాలుపంచుకోకూడదు.
    4. మీరు వైరస్‌లను లేదా ఇతర హానికర కోడ్‌ను అప్‌లోడ్ చేయకూడదు.
    5. మీరు వేరొకరికి చెందిన లాగిన్ సమాచారాన్ని కోరకూడదు లేదా ఖాతాను యాక్సెస్ చేయకూడదు.
    6. మీరు ఎవరైనా వినియోగదారుని బెదిరించడం, భయపెట్టడం లేదా హింసించడం వంటివి చేయకూడదు.
    7. మీరు ఈ విధమైన కంటెంట్‌ను పోస్ట్ చేయకూడదు: విద్వేషపూరిత ప్రసంగం, బెదిరించడం లేదా అశ్లీలత; హింసను ప్రేరేపించడం; లేదా నగ్నత్వం లేదా గ్రాఫిక్ లేదా అసందర్భ హింసను కలిగి ఉండేవి.
    8. మీరు తగిన వయస్సు-ఆధారిత నియంత్రణలు లేకుండా ఆల్కహాల్, డేటింగ్ లేదా ఇతర పెద్దల సంబంధిత కంటెంట్ (ప్రకటనలతో సహా) ఉన్న మూడవ-పక్ష అప్లికేషన్‌ను అభివృద్ధి చేయకూడదు లేదా నిర్వహించకూడదు.
    9. మీరు ఏవైనా చట్టబద్ధంకాని, తప్పుదారి పట్టించే, హానికర లేదా వివక్షతో కూడుకున్నటు వంటి వాటిని చూపడానికి Facebookను ఉపయోగించకూడదు.
    10. మీరు పేజీ రెండరింగ్ లేదా ఇతర Facebook పనితీరుతో సేవపై దాడి లేదా జోక్యం తిరస్కరణ వంటి Facebook సరిగ్గా పని చేయకుండా లేదా కనిపించకుండా నిలిపివేయగల, ఎక్కువ ఒత్తిడి కలిగించగల లేదా బలహీనపరచగల పనులు ఏవీ చేయకూడదు.
    11. మీరు ఈ ప్రకటన లేదా మా విధానాలను ఉల్లంఘించే అవకాశం కల్పించకూడదు లేదా అలా చేసేలా ప్రోత్సహించకూడదు.
       
  4. నమోదు మరియు ఖాతా భద్రత

    Facebook వినియోగదారులు వారి అసలు పేర్లు మరియు సమాచారాన్ని అందించాలి మరియు అలా చేయడానికి మాకు మీ సహకారం అవసరం. మీ ఖాతాను నమోదు చేయడం మరియు దాని భద్రతను నిర్వహించడానికి సంబంధించి మీరు మా కోసం చేయగల కొన్ని వాగ్దానాలు ఇక్కడ ఉన్నాయి:
    1. మీరు Facebookలో వ్యక్తిగత సమాచారం ఏదీ తప్పుగా అందించకూడదు లేదా మీ కోసం కాకుండా ఇతరుల కోసం అనుమతి లేకుండా ఖాతాను సృష్టించకూడదు.
    2. మీరు ఒకటి కంటే ఎక్కువ వ్యక్తిగత ఖాతాలను సృష్టించుకోకూడదు.
    3. మేము మీ ఖాతాను నిలిపివేస్తే, మా అనుమతి లేకుండా మీరు వేరొకటి సృష్టించకూడదు.
    4. మీరు మీ స్వంత వ్యాపార లబ్ది కోసం ప్రాథమికంగా మీ వ్యక్తిగత టైమ్‌లైన్‌ను ఉపయోగించుకోకూడదు, అటువంటి అవసరాల కోసం Facebook పేజీని ఉపయోగించాలి.
    5. మీ వయస్సు 13 ఏళ్ల కంటే తక్కువ ఉంటే Facebook ఉపయోగించకూడదు.
    6. మీరు లైంగిక సంబంధిత నేరంలో దోషి అయితే Facebookను ఉపయోగించకూడదు.
    7. మీరు మీ సంప్రదింపు సమాచారాన్ని ఖచ్చితంగా మరియు ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ ఉంచుకోవాలి.
    8. మీరు మీ పాస్‌వర్డ్‌ను ఎవరితోనూ పంచుకోకూడదు (లేదా డెవలపర్‌లు అయితే, మీ భద్రతా కీని పంచుకోకూడదు), మీ ఖాతాను వేరెవ్వరినీ యాక్సెస్ చేయనీయకూడదు లేదా మీ ఖాతా భద్రతకు హాని కలిగించే దేన్నీ చేయకూడదు.
    9. మీరు ముందుగా మా వ్రాతపూర్వక అనుమతి పొందకుండా మీ ఖాతాను (మీరు నిర్వహించే ఏదైనా పేజీ లేదా అప్లికేషన్‌తో సహా) ఎవ్వరికీ బదిలీ చేయకూడదు.
    10. మీరు మీ ఖాతా లేదా పేజీ కోసం వినియోగదారు పేరు లేదా సారూప్య ఐడెంటిఫైయర్‌ను ఎంచుకుంటే, అది సముచితంగా (వ్యాపారచిహ్నం యజమాని వినియోగదారు పేరు అతని అసలు పేరుకు దగ్గరగా లేనట్లు ఫిర్యాదు చేయడం వంటివి) ఉన్నట్లు మేము విశ్వసిస్తే దాన్ని తీసివేయడానికి లేదా తిరిగి క్లెయిమ్ చేయడానికి మాకు హక్కు ఉంటుంది.
       
  5. ఇతర వ్యక్తుల హక్కులను రక్షించడం

    మేము ఇతర వ్యక్తుల హక్కులను గౌరవిస్తాము, అలాగే మీరు కూడా ఇతరుల హక్కులను గౌరవిస్తారని ఆశిస్తున్నాము.
    1. మీరు Facebookలో వేరొకరి హక్కులను అతిక్రమించే లేదా ఉల్లంఘించే లేదా చట్టాన్ని ఉల్లంఘించే కంటెంట్‌ను పోస్ట్ చేయకూడదు లేదా ఏదైనా చర్య తీసుకోకూడదు.
    2. మీరు Facebookలో పోస్ట్ చేసే ఏదైనా కంటెంట్ లేదా సమాచారం ఈ ప్రకటన లేదా మా విధానాలను ఉల్లంఘిస్తోందని మేము విశ్వసిస్తే దాన్ని తీసివేస్తాము.
    3. మీ మేథో సంపత్తి హక్కులను రక్షించుకోవడంలో మీకు సహాయపడటానికి మేము మీకు సాధనాలను అందిస్తున్నాము. మరింత తెలుసుకోవడానికి, మేథో సంపత్తి హక్కుల అతిక్రమణ క్లెయిమ్‌లను ఎలా నివేదించాలి పేజీని సందర్శించండి.
    4. వేరొకరి కాపీరైట్‌ను అతిక్రమించినందున మేము మీ కంటెంట్‌ను తీసివేస్తే, దాన్ని మేము తప్పుగా తీసివేసినట్లు మీరు విశ్వసిస్తే, అప్పీలు చేసుకోవడానికి మేము మీకు అవకాశం ఇస్తాము.
    5. మీరు తరచూ ఇతర వ్యక్తుల మేథో సంపత్తి హక్కులను అతిక్రమిస్తుంటే, తగిన సమయంలో మేము మీ ఖాతాను నిలిపివేస్తాము.
    6. మా బ్రాండ్ వినియోగ మార్గదర్శకాలచే లేదా మా ముందస్తు వ్రాతపూర్వక అనుమతితో అనుమతించబడినవి తప్ప మా కాపీరైట్‌లు లేదా ట్రేడ్‌మార్క్‌లు లేదా తికమకపెట్టే అటువంటి గుర్తులను ఉపయోగించకూడదు.
    7. మీరు వినియోగదారుల నుండి సమాచారాన్ని సేకరిస్తే, మీరు ఇవి చేయాలి: వారి సమ్మతి పొందడం, వారి సమాచారాన్ని మీరే (Facebook కాదు) పొందుతున్నారని నిర్ధారించుకోవడం మరియు మీరు సేకరించే సమాచారం మరియు మీరు దాన్ని ఎలా ఉపయోగించాలో వివరించే గోప్యతా విధానాన్ని పోస్ట్ చేయడం.
    8. మీరు Facebookలో ఏ ఒక్కరి గుర్తింపు పత్రాలు లేదా ముఖ్యమైన ఆర్థిక సమాచారాన్ని పోస్ట్ చేయకూడదు.
    9. మీరు వినియోగదారులను ట్యాగ్ చేయకూడదు లేదా వినియోగదారులు కాని వారికి వారి సమ్మతి లేకుండా ఇమెయిల్ ఆహ్వానాలు పంపకూడదు. ట్యాగ్ చేయడంపై అభిప్రాయాన్ని అందించడానికి వినియోగదారులను అనుమతించడం కోసం Facebook సామాజిక నివేదన సాధనాలను అందిస్తోంది.
       
  6. మొబైల్ మరియు ఇతర పరికరాలు

    1. ప్రస్తుతం మేము మా మొబైల్ సేవలను ఉచితంగా అందిస్తున్నాము, కానీ దయచేసి వచన సందేశం మరియు డేటా ఛార్జీల వంటి మీ క్యారియర్ సాధారణ ధరలు మరియు ఫీజులు ఇప్పటికీ వర్తిస్తాయని తెలుసుకోండి.
    2. మీరు మీ మొబైల్ టెలిఫోన్ నంబర్‌ను మార్చితే లేదా నిష్క్రియం చేస్తే, మీ పాత నంబర్‌ను కలిగి ఉన్న వ్యక్తికి మీ సందేశాలు పంపబడలేదని నిర్ధారించుకోవడానికి మీరు 48 గంటల్లోపు Facebookలో మీ ఖాతా సమాచారాన్ని నవీకరించుకోవాలి.
    3. Facebookలో వినియోగదారులకు కనిపించే ఏదైనా సమాచారంతో వారి పరికరాలను సమకాలీకరించడానికి (అప్లికేషన్ ద్వారా కూడా) వారిని అనుమతించడానికి అవసరమైన సమ్మతి మరియు అన్ని హక్కులను మీరు అందించాలి.
       
  7. చెల్లింపులు

    మీరు Facebookలో చెల్లింపు చేస్తే, ఇతర నిబంధనలు వర్తిస్తాయని పేర్కొంటే తప్ప మా చెల్లింపు నిబంధనలకు మీరు అంగీకరిస్తున్నారు.
     
  8. అప్లికేషన్‌లు మరియు వెబ్‌సైట్‌ల డెవలపర్‌లు/ఆపరేటర్‌లకు వర్తించే ప్రత్యేక నిబంధనలు

    మీరు ప్లాట్‍‌ఫారమ్ అప్లికేషన్ లేదా వెబ్‌సైట్‌కు డెవలపర్ లేదా ఆపరేటర్ అయితే లేదా మీరు సామాజిక ప్లగిన్‌లను ఉపయోగిస్తే, మీరు తప్పనిసరిగా Facebook ప్లాట్‌ఫారమ్ విధానంకి కట్టుబడి ఉండాలి.
  9. Facebook అందించిన లేదా మెరుగుపరిచిన ప్రకటనలు మరియు ఇతర వాణిజ్య కంటెంట్ గురించి

    మా వినియోగదారులు మరియు ప్రకటనదారులకు విలువైన ప్రకటన మరియు ఇతర వాణిజ్య లేదా ప్రాయోజిత కంటెంట్‌ను బట్వాడా చేయడమే మా లక్ష్యం. అలా చేయడానికి మాకు సహాయపడే క్రమంలో, మీరు క్రింది వాటికి అంగీకరించాలి:
    1. వాణిజ్య, ప్రాయోజిత లేదా, మేము అందించిన లేదా మెరుగుపరిచిన సంబంధిత కంటెంట్‌కు (మీరు ఇష్టపడే బ్రాండ్ వంటిది) సంబంధించి మీ పేరు, ప్రొఫైల్ చిత్రం, కంటెంట్ మరియు సమాచారాన్ని ఉపయోగించడానికి మీరు మాకు అనుమతివ్వాలి. అంటే ఉదాహరణకు, మీకు ఎటువంటి పరిహారం లేకుండా మీ కంటెంట్ లేదా సమాచారంతో మీ పేరు మరియు/లేదా ప్రొఫైల్ చిత్రాన్ని ప్రదర్శించడం కోసం మాకు చెల్లించడానికి మీరు వ్యాపారం లేదా ఇతర అంశానికి అనుమతివ్వాలి. మీరు మీ కంటెంట్ లేదా సమాచారం కోసం నిర్దిష్ట ప్రేక్షకులను ఎంచుకుంటే, దాన్ని మేము ఉపయోగించినప్పుడు మీ ఎంపికను గౌరవిస్తాము.
    2. మేము మీ సమ్మతి లేకుండా మీ కంటెంట్ లేదా సమాచారాన్ని ప్రకటనదారులకు ఇవ్వము.
    3. చెల్లింపు సేవలు మరియు కమ్యూనికేషన్‌లను మేము ఎల్లప్పుడూ గుర్తించకపోవచ్చని మీరు అర్థం చేసుకోవాలి.
       
  10. ప్రకటనదారులకు వర్తించదగిన ప్రత్యేక నిబంధనలు

    ఏదైనా ప్రకటన లేదా ఇతర వాణిజ్య లేదా ప్రాయోజిత కార్యాచరణ లేదా కంటెంట్ (సంయుక్తంగా “స్వీయ-సేవ ప్రకటన ఇంటర్‌ఫేస్‌లు” అని పిలుస్తారు) సృష్టి, సమర్పణ మరియు/లేదా బట్వాడా కోసం మీరు మా స్వీయ-సేవ ప్రకటన సృష్టి ఇంటర్‌ఫేస్‌లను ఉపయోగిస్తే, మీరు మా స్వీయ-సేవ ప్రకటన నిబంధనలకు అంగీకరిస్తున్నారు. అదనంగా, మీ ప్రకటన లేదా ఇతర వాణిజ్య లేదా ప్రాయోజిత కార్యకలాపం లేదా Facebookలో ఉంచిన కంటెంట్ లేదా మా ప్రచురణకర్త నెట్‌వర్క్ మా ప్రకటన విధానాలకు అనుగుణంగా ఉండాలి.
  11. పేజీలకు వర్తించే ప్రత్యేక నిబంధనలు

    మీరు Facebookలో పేజీని సృష్టిస్తే లేదా నిర్వహిస్తే, లేదా మీ పేజీ నుండి ప్రచారం చేస్తే లేదా ఆఫర్ అందిస్తే, మీరు మా పేజీల నిబంధనలకు అంగీకరిస్తున్నట్లు అర్థం.
     
  12. సాఫ్ట్‌వేర్‌కు వర్తించే ప్రత్యేక నిబంధనలు

    1. మీరు స్టాండ్-అలోన్ సాఫ్ట్‌వేర్ ఉత్పత్తి, అప్లికేషన్ లేదా బ్రౌజర్ ప్లగిన్ వంటి మా సాఫ్ట్‌వేర్‌ను డౌన్‌లోడ్ చేస్తే లేదా ఉపయోగిస్తే, సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయడం, మెరుగుపరచడం మరియు మరింత అభివృద్ధిపరిచే క్రమంలో సాఫ్ట్‌వేర్ కాలానుగుణంగా అప్‌గ్రేడ్‌లు, నవీకరణలు మరియు అదనపు లక్షణాలను డౌన్‌లోడ్ చేయవచ్చు మరియు ఇన్‌స్టాల్ చేయవచ్చని మీరు అంగీకరిస్తున్నారు.
    2. ఓపెన్ సోర్స్ లైసెన్స్ క్రింద అలా చేయడానికి మీరు నిర్దిష్టంగా అనుమతిస్తే, లేదా మేము మీకు వ్రాతపూర్వక అనుమతి ఇస్తే తప్ప మీరు వుత్పన్న పనులను సవరించకూడదు, సృష్టించకూడదు, డీకంపైల్ చేయకూడదు, లేదా ఖచ్చితమైన సోర్స్ కోడ్ కోసం ప్రయత్నించకూడదు.

  13. సవరణలు

    1. ఈ నిబంధనలకు మార్పులు చేయడానికి ముందు మీకు తెలియజేస్తాము మరియు మా సేవలను ఉపయోగించడం కొనసాగించడానికి ముందు సవరించిన నిబంధనల్లో సమీక్షించడం మరియు వ్యాఖ్యానించే అవకాశాన్ని మీకు అందిస్తాము.
    2. ఈ ప్రకటనలో పేర్కొన్న లేదా దీనిచే చేర్చబడిన విధానాలు, మార్గదర్శకాలు లేదా ఇతర నిబంధనలకు మేము మార్పులు చేస్తే, మేము సైట్ నిర్వహణ పేజీలో నోటీసును అందించవచ్చు.
    3. మా నిబంధనలు, విధానాలు లేదా మార్గదర్శకాల మార్పులకు సంబంధించి నోటీసు అందించిన తర్వాత కూడా మీరు Facebook సేవలను ఉపయోగించడం కొనసాగిస్తే, మీరు మా సవరించిన నిబంధనలు, విధానాలు లేదా మార్గదర్శకాలకు అంగీకరిస్తున్నట్లు పరిగణించబడుతుంది.
       
  14. ఉపసంహరణ

    మీరు ఈ ప్రకటనలోని ముఖ్యోద్దేశ్యాన్ని ఉల్లంఘిస్తే లేదా మాకు రిస్కు కలిగించినా లేదా మాపై సంభావ్యంగా చట్టపరమైన చర్యలు తీసుకునేలా చేస్తే, మేము మీకు Facebookను పాక్షికంగా లేదా పూర్తిగా ఆపివేస్తాము. మేము మీకు ఇమెయిల్ ద్వారా లేదా మీరు మీ ఖాతాకు యాక్సెస్ చేయడానికి ప్రయత్నించిన తదుపరిసారి తెలియజేస్తాము. అలాగే మీరు ఎప్పుడైనా మీ ఖాతాను తొలగించవచ్చు లేదా మీ అప్లికేషన్‌ను నిలిపివేయవచ్చు. అటువంటి అన్ని సందర్భాల్లో, ఈ ప్రకటన ఉపసంహరించబడుతుంది, కానీ క్రింది అంశాలు ఇప్పటికీ వర్తిస్తాయి: 2.2, 2.4, 3-5, 9.3 మరియు 14-18.
     
  15. వివాదాలు

    1. మీకు ప్రత్యేకంగా యు.ఎస్‌లో లేదా ఈ ప్రకటనకు సంబంధించి లేదా Facebookలో మాతో ఉన్న ఏదైనా క్లెయమ్, చర్యా కారణం లేదా వివాదాన్ని (క్లెయిమ్) పరిష్కరించుకోవాలి. కాలిఫోర్నియా ఉత్తర ప్రాంతానికి చెందిన లేదా ప్రాంతీయ న్యాయస్థానం లేదా శాన్ మాటియో ప్రాంతంలోని ప్రభుత్వ న్యాయస్థానం మరియు మీరు అటువంటి క్లెయిమ్‌లు అన్నింటినీ వ్యాజ్యం వేసే కారణం కోసం అటువంటి న్యాయస్థానాల వ్యక్తిగత అధికారానికి సమర్పించేందుకు అంగీకరించాలి. కాలిఫోర్నియా రాష్ట్రం చట్టాలు ఈ ప్రకటనను, అలాగే మీకు మాకు మధ్య సంభవించిన ఏదైనా క్లెయిమ్‌ను చట్టం నియమాల వైరుధ్యంతో సంబంధం లేకుండా నిర్వహిస్తాయి.
    2. Facebookలో మీ చర్యలు, కంటెంట్ లేదా సమాచారానికి సంబంధించి మాకు వ్యతిరేకంగా ఎవరైనా క్లెయిమ్ పొందితే, అన్ని నష్టపరిహారాలు, నష్టాలు మరియు అటువంటి క్లెయిమ్‌కు సంబంధించిన ఏవైనా ఖర్చులు (సముచిత చట్టబద్ధమైన ఫీజులు మరియు ఖర్చులతో సహా) నుండి మరియు వాటిపై పరిహారం పొందుతారు మరియు మమ్మల్ని హాని లేకుండా ఉంచుతారు. వినియోగదారు ప్రవర్తనకు మేము నియమాలను అందించినప్పటికీ, మేము Facebookలో వినియోగారు చర్యలను నియంత్రించము లేదా నిర్దేశించము మరియు Facebookలో వినియోగదారులు బదిలీ చేసే లేదా భాగస్వామ్యం చేసే కంటెంట్ లేదా సమాచారానికి మేము బాధ్యులం కాదు. Facebookలో మీరు ఎదుర్కొనవచ్చనే ఏదైనా ప్రమాదకర, అసందర్భ, అశ్లీల, చట్టబద్ధంకాని లేదా అభ్యంతరకరమైన కంటెంట్ కోసం మేము బాధ్యులం కాదు. ఎవరైనా Facebook వినియోగదారుని ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ప్రవర్తనకు మేము బాధ్యులం కాదు.
    3. మేము FACEBOOKను ఉన్నతంగా, బగ్-రహితంగా మరియు సురక్షితంగా ఉంచడానికి ప్రయత్నిస్తాము, కానీ మీరు దాన్ని మీ స్వంత రిస్క్‌పై ఉపయోగించాలి. మేము FACEBOOKను నిర్దిష్ట కారణం కోసం వర్తక, ఫిట్‌నెస్ మరియు ఉల్లంఘన లేని పరోక్ష హామీలతో సహా, వాటికే పరిమితం కాకుండా ఏ విధమైన ప్రత్యక్ష లేదా పరోక్ష హామీలు లేకుండా అందిస్తున్నాము. FACEBOOK ఎల్లప్పుడూ సురక్షితంగా, భద్రంగా లేదా దోష రహితంగా ఉంటుందని లేదా FACEBOOK ఎల్లప్పుడూ అంతరాయాలు, ఆలస్యాలు లేదా లోపాలు లేకుండా పని చేస్తుందని మేము గ్యారంటీ ఇవ్వము. మూడవ పక్షాల చర్యలు, కంటెంట్, సమాచారం లేదా డేటాకు FACEBOOK బాధ్యత వహించదు, అటువంటి ఏవైనా మూడవ పక్షాలపై మీకు ఉన్న ఏదైనా క్లెయిమ్‌తో ఉత్పన్నమయ్యే లేదా దానికి సంబంధించి తెలిసిన మరియు తెలియని ఏవైనా క్లెయిమ్‌లు మరియు నష్టాల నుండి మమ్మల్ని, మా డైరెక్టర్‌లను, అధికారులను, ఉద్యోగులను మరియు ఏజెంట్‌లను మీరు విడుదల చేస్తారు. మీరు కాలిఫోర్నియా నివాసి అయితే, మీరు కాలిఫోర్నియా పౌర కోడ్ §1542ను వదులుకోవాలి, ఇది ఈ విధంగా వివరిస్తోంది: సాధారణ విడుదల రుణదాతకు తెలియని క్లెయిమ్‌లకు విస్తరించదు లేదా విడుదలను అమలు చేసే సమయంలో అతను లేదా ఆమెకు అనుకూలంగా ఉండటానికి ఊహించబడుతుంది, అతను లేదా ఆమెకు తెలిస్తే రుణగ్రస్తునితో అతని లేదా ఆమె పరిష్కారం ముఖ్యంగా ప్రభావితం చేయబడుతుంది. ఏవైనా నష్టపోయిన లేదా ఇతర సంభావ్య, ప్రత్యేక, పరోక్ష ఆదాయాలకు లేదా ఈ ప్రకటన లేదా FACEBOOK వల్ల జరిగిన లేదా వాటికి సంబంధించిన అనుకోని నష్టాలకు, అటువంటి నష్టాల సాధ్యతను మేము సూచిస్తే తప్ప మీకు బాధ్యత వహించము. ఈ ప్రకటన లేదా FACEBOOKలో సంభవించే మా సమిష్టి బాధ్యత వంద డాలర్‌లకు ($100) లేదా గత పన్నెండు నెలల్లో మీరు మాకు చెల్లించిన గరిష్ట మొత్తానికి మించకూడదు. వర్తించదగిన చట్టం బాధ్యత లేదా సంభావ్య లేదా ముఖ్యమైన నష్టాల పరిమితి లేదా మినహాయింపును అనుమతించకపోవచ్చు, కాబట్టి ఎగువ పరిమితి లేదా మినహాయింపు మీకు వర్తించకపోవచ్చు. అటువంటి సందర్భాల్లో FACEBOOK బాధ్యత వర్తించదగిన చట్టం ప్రకారం అనుమతించబడిన పూర్తి స్థాయికి పరిమితం చేయబడుతుంది.
       
  16. యునైటెడ్ స్టేట్స్ వెలుపలి వినియోగదారులకు వర్తించదగిన ప్రత్యేక నిబంధనలు

    మేము ప్రతి ఒక్కరి కోసం స్థిరమైన ప్రమాణాలతో ఒక సార్వజనీన సంఘాన్ని సృష్టించడానికి కృషి చేస్తాము, అంతేకాకుండా మేము స్థానిక చట్టాలను కూడా గౌరవించడానికి ప్రయత్నిస్తాము. క్రింది నియమాలు యునైటెడ్ స్టేట్స్ వెలుపల Facebookతో పరస్పర చర్య చేసే వినియోగదారులు మరియు వినియోగదారులు కాని వారికి వర్తిస్తాయి:
    1. యునైటెడ్ స్టేట్స్‌కు బదిలీ చేసిన మరియు ప్రాసెస్ చేసిన మీ వ్యక్తిగత డేటాను కలిగి ఉండటానికి మీరు సమ్మతించాలి.
    2. మీరు యునైటెడ్ స్టేట్స్ నిషేధిత ప్రాంతంలో లేదా యు.ఎస్‌లో నివసిస్తుంటే. మీరు ప్రత్యేకంగా నియమించిన దేశాల ట్రెజరీ శాఖ జాబితా, మీరు Facebookలో (ప్రకటన లేదా చెల్లింపులు వంటివి) వాణిజ్య కార్యకలాపాల్లో పాలుపంచుకోరు లేదా ప్లాట్‌ఫారమ్ అప్లికేషన్ లేదా వెబ్‌సైట్‌ను నిర్వహించరు. మీరు యునైటెడ్ స్టేట్స్ నుండి ఉత్పత్తులు, సేవలు లేదా అక్కడ తయారైన సాఫ్ట్‌వేర్‌ను స్వీకరించకుండా నిషేధించబడితే, మీరు Facebook ఉపయోగించకూడదు.
    3. జర్మన్ వినియోగదారులకు మాత్రమే వర్తించే కొన్ని నిర్దిష్ట పదాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.
  17. నిర్వచనాలు

    1. "Facebook" లేదా” Facebook సేవలు” ద్వారా అంటే (ఎ) మా వెబ్‌సైట్ www.facebook.comలో మరియు ఏదైనా ఇతర Facebook బ్రాండెడ్ లేదా సహ-బ్రాండెడ్ వెబ్‌సైట్‌ల (ఉప-డొమైన్‌లు, అంతర్జాతీయ సంస్కరణలు, విడ్జెట్‌లు మరియు మొబైల్ సంస్కరణలతో సహా) (బి) మా ప్లాట్‌ఫారమ్; (c) ఇష్టం బటన్, భాగస్వామ్యం బటన్ మరియు ఇతర అటువంటి అందుబాటులోని ఎంపికలు వంటి సామాజిక ప్లగిన్‌లు; మరియు (డి) ఇతర మీడియా, బ్రాండ్‌లు, ఉత్పత్తులు, సేవలు, సాఫ్ట్‌వేర్ (సాధనపట్టీ వంటిది), పరికరాలు లేదా ఇప్పుడు ఉనికిలో ఉన్న లేదా భవిష్యత్తులో అభివృద్ధి చెందే నెట్‌వర్క్‌ల ద్వారా వాటితో సహా మేము అందుబాటులో ఉంచే లక్షణాలు మరియు సేవలు అని అర్థం. Facebook దాని స్వంత అభీష్టానుసారం ప్రత్యేక షరతుల్లో నిర్వహించబడిన మరియు ఈ SRRలో కాని మా నిర్ణీత బ్రాండ్‌లు, ఉత్పత్తులు లేదా సేవలను కేటాయించడానికి హక్కు కలిగి ఉంది.
    2. "ప్లాట్‌ఫారమ్" ద్వారా అంటే Facebook నుండి డేటాను తిరిగి పొందడానికి లేదా మాకు డేటాను అందించడానికి అప్లికేషన్ డెవలపర్‌లు మరియు వెబ్‌సైట్ నిర్వాహకులతో సహా ఇతరులను అనుమతించే APIల సమితి మరియు సేవలు (కంటెంట్ వంటిది) అని అర్థం.
    3. "సమాచారం" ద్వారా అంటే Facebookతో పరస్పర చర్య చేసే వినియోగదారులు మరియు వినియోగదారులు కాని వారు చేపట్టిన చర్యలతో సహా మీ గురించి వాస్తవాలు మరియు ఇతర సమాచారం అని అర్థం.
    4. "కంటెంట్" ద్వారా అంటే Facebook సేవలను ఉపయోగించి మీరు లేదా ఇతర వినియోగదారులు పోస్ట్ చేసిన, అందించిన లేదా భాగస్వామ్యం చేసినవి అని అర్థం.
    5. "డేటా" లేదా "వినియోగదారు డేటా" లేదా "వినియోగదారుల డేటా" ద్వారా అంటే మీరు లేదా మూడవ పక్షాలు Facebook నుండి తిరిగి పొందగల లేదా ప్లాట్‌ఫారమ్ ద్వారా Facebookకు అందించగల వినియోగదారు కంటెంట్ లేదా సమాచారంతో సహా ఏదైనా డేటా అని అర్థం.
    6. "పోస్ట్" ద్వారా అంటే Facebookలోని పోస్ట్ లేదా Facebook ఉపయోగించి అందుబాటులో ఉంచడం అని అర్థం.
    7. "వినియోగం" ద్వారా అంటే వినియోగం, అమలు చేయడం, కాపీ చేయడం, పబ్లిక్‌గా కనిపించడం లేదా ప్రదర్శించడం, పంపిణీ చేయడం, సవరించడం, అనువదించడం మరియు వుత్పన్న పనులను సృష్టించడం అని అర్థం.
    8. "అప్లికేషన్" ద్వారా అంటే ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించే లేదా ప్రాప్యత చేసే ఏదైనా అప్లికేషన్ లేదా వెబ్‌సైట్, అలాగే మా నుండి స్వీకరించే లేదా స్వీకరించిన డేటా ఏదైనా అని అర్థం.  మీరు ఇప్పుడు ప్లాట్‌ఫారమ్‌ను ప్రాప్యత చేయలేకుండా, మా నుండి డేటా మొత్తం తొలగించకుంటే, మీరు డేటాను తొలగించే వరకు అప్లికేషన్ అనే పదం వర్తింపజేయబడుతుంది.
    9. “వ్యాపారచిహ్నాల” వారీగా మేము ఇక్కడ వ్యాపారచిహ్నాల జాబితాను అందించాము.
       
  18. ఇతరం

    1. మీరు యు.ఎస్ లేదా కెనడాలో నివసిస్తుంటే లేదా అక్కడ మీ వ్యాపార ప్రదాన కేంద్రం ఉంటే, ఈ ప్రకటన మీకు మరియు Facebook, Inc మధ్య ఒప్పందంగా పరిగణించబడుతుంది.  లేకుంటే, ఈ ప్రకటన మీకు మరియు Facebook ఐర్లాండ్ లిమిటెడ్ మధ్య ఒప్పందంగా పరిగణించబడుతుంది.  “మాకు,” “మేము,” మరియు “మా” ప్రస్తావనలు అంటే Facebook, Inc. లేదా Facebook ఐర్లాండ్ లిమిటెడ్ అని అర్థం.
    2. ఈ ప్రకటన Facebookకి సంబంధించి పార్టీల మధ్య ఒప్పందం మొత్తాన్ని ఏర్పరుస్తుంది, మరియు ఏవైనా ప్రాధాన్య ఒప్పందాలను అధిగమిస్తుంది.
    3. ఈ ప్రకటనలోని ఏదైనా భాగం అమలుకానట్లు కనుగొనబడితే, మిగిలిన భాగం పూర్తిగా అమలు చేయబడుతుంది మరియు ప్రభావవంతంగా ఉంటుంది.
    4. మేము ఈ ప్రకటనలో దేన్నయినా అమలు చేయడంలో విఫలమైతే, అది రద్దుగా పరిగణించబడదు.
    5. ఈ ప్రకటనకు చేసిన ఏవైనా సవరణలు లేదా రద్దు తప్పనిసరిగా మాచే వ్రాయబడి, సంతకం చేయబడుతుంది.
    6. మీరు ఈ ప్రకటన క్రింద మీ హక్కులు లేదా బాధ్యతలను వేటినైనా మా సమ్మతి లేకుండా వేరొకరికి బదిలీ చేయకూడదు.
    7. ఈ ప్రకటన క్రింద మా హక్కులు మరియు బాధ్యతలన్నీ ఆస్తుల విలీనం, ఆర్జన లేదా విక్రయానికి సంబంధించి లేదా చట్టం లేదా వేరొక విధంగా నిర్వహణ ద్వారా మాచే సులభంగా కేటాయించబడతాయి.
    8. ఈ ప్రకటనలో ఏదీ చట్టానికి అనుగుణంగా ఉండకుండా మమ్మల్ని నిరోధించలేదు.
    9. ఈ ప్రకటన మూడవ పక్ష లబ్దిదారు హక్కులు వేటినీ అందించదు.
    10. మేము నిర్దిష్టంగా మీకు మంజూరు చేసిన అన్ని హక్కులను మేము ప్రత్యేకించాము.
    11. Facebookను ఉపయోగించేటప్పుడు లేదా ప్రాప్యత చేసేటప్పుడు అన్ని వర్తించదగిన చట్టాలతో మీరు అనుకూలంగా ఉండాలి.

Facebook సేవలను వినియోగించడం లేదా ప్రాప్యత చేయడం ద్వారా కాలానుగుణంగా సవరించిన డేటా విధానంకి సంబంధించి అటువంటి కంటెంట్ మరియు సమాచారాన్ని మేము సేకరించవచ్చు మరియు ఉపయోగించవచ్చని మీరు అంగీకరిస్తున్నారు. మీ Facebook వినియోగం గురించి అదనపు సమాచారాన్ని అందించే క్రింది పత్రాలను కూడా మీరు సమీక్షించాలనుకోవచ్చు:
  • చెల్లింపు నిబంధనలు: అదనపు నిబంధనలు వర్తించబడతాయని పేర్కొంటే తప్ప ఈ అదనపు నిబంధనలు Facebook ద్వారా చేసిన అన్ని చెల్లింపులకు వర్తిస్తాయి.
  • ప్లాట్‌ఫారమ్ పేజీ: మీరు మూడవ పక్ష అప్లికేషన్‌ను జోడించినప్పుడు లేదా Facebook కనెక్ట్ ఉపయోగించినప్పుడు వారు మీ డేటాను ఎలా ప్రాప్యత చేయగలరు మరియు ఉపయోగించగలరు అనే దానితో సహా ఏమి జరిగిందో ఉత్తమంగా అర్థం చేసుకోవడానికి ఈ పేజీ మీకు సహాయపడుతుంది.
  • Facebook ప్లాట్‌ఫారమ్ విధానాలు: ఈ మార్గదర్శకాలు కనెక్ట్ సైట్‌లతో సహా అప్లికేషన్‌లకు వర్తించే విధానాలను క్లుప్తంగా వివరిస్తాయి.
  • ప్రకటన విధానాలు: ఈ మార్గదర్శకాలు Facebookలో ఉంచిన ప్రకటనలకు వర్తించే విధానాలను క్లుప్తంగా వివరిస్తాయి.
  • స్వీయ-సేవ ప్రకటన నిబంధనలు: మీరు ఏదైనా ప్రకటన లేదా ఇతర వాణిజ్య లేదా ప్రాయోజిత కార్యక్రమం లేదా కంటెంట్‌ను సృష్టించడానికి, సమర్పించడానికి, లేదా బట్వాడా చేయడానికి స్వీయ-సేవ ప్రకటన ఇంటర్‌ఫేస్‌లను ఉపయోగించినప్పుడు ఈ నిబంధనలు వర్తిస్తాయి.
  • ప్రచార మార్గదర్శకాలు: ఈ మార్గదర్శకాలు మీరు Facebookలో పోటీలు, పందేలు మరియు ఇతర రకాల ప్రచారాలను అందిస్తే వర్తించే విధానాలను వివరిస్తాయి.
  • Facebook బ్రాండ్ వనరులు: ఈ మార్గదర్శకాలు Facebook ట్రేడ్‌మార్క్‌లు, చిహ్నాలు మరియు స్క్రీన్‌షాట్‌ల వినియోగానికి వర్తించే విధానాలను వివరిస్తాయి.
  • పేజీల నిబంధనలు: ఈ మార్గదర్శకాలు మీ Facebook పేజీల వినియోగానికి వర్తిస్తాయి.
  • సంఘం ప్రమాణాలు: ఈ మార్గదర్శకాలు మీరు Facebookకు పోస్ట్ చేసిన కంటెంట్ మరియు Facebookలో మీ కార్యాచరణ గురించి మా అంచనాలను వివరిస్తాయి.

వివిధ భిన్నమైన భాషల్లో హక్కులు మరియు బాధ్యతల ప్రకటనను ప్రాప్యత చేయడానికి, చాలా పేజీల్లో ఎడమవైపు అంచున ఉన్న భాష లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా మీ Facebook సెషన్ కోసం భాష సెట్టింగ్‌ను మార్చండి.  మీరు ఎంచుకున్న భాషలో ప్రకటన అందుబాటులో లేకుంటే, మేము ఆంగ్లం వెర్షన్‌ను డిఫాల్ట్‌గా అందిస్తాము.